Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిధాని ఓవైసీ జంక్షన్లో మల్టీలెవల్ పైవంతెన
- ప్రారంభించిన మంత్రులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని మిధానిఓవైసీ హాస్పిటల్ జంక్షన్ మల్టీలెవల్ ఫ్లై ఓవర్‌ను ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్‌గా నామకరణం చేస్తూ పుర పాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ట్విట్టర్ ద్వారా మంగళవారం ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఉన్న డీఆర్డీఓలో దశాబ్దాల కాలం పాటు పని చేసినందున ఆయన జ్ఞాపకార్థం ఫ్లైఓవర్‌కు పేరు పెట్టినట్టు తెలిపారు. రూ.80 కోట్ల అంచనాతో చేపట్టిన ఫ్లైఓవర్‌ను మంత్రులు మహమూద్‌అలీ, సబితాఇంద్రారెడ్డి, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి మంగళవారం కేటీఆర్ ప్రారంభించారు. దీంతో వాహనాల రాకపోకలు షురూ అయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్ ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు సయ్యద్ అమినుల్ హాసన్ జాఫ్రీ, మీర్జా రియాజ్ ఎఫెంది, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్‌రెడ్డి, కార్పొరేటర్లు మిర్జా ముస్తఫా బేగ్, వంగా మధుసూధన్‌రెడ్డి, రేష్మ ఫాతిమా, మహమ్మద్ ముజఫర్ హుస్సేన్, ఈఎన్సీ రుమాండ్ల శ్రీధర్, చీఫ్ ఇంజినీర్ దేవానంద్, ఎస్ఈ దత్తుపంతు తదితరులు పాల్గొన్నారు.