Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలగాణ - కోనరావుపేట
అప్పుల బాధతో రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన ఫణి నర్సయ్య(52) తన రెండెకరాల భూమిలో వరి సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాడు. కూతురు పెండ్లికి కొంత అప్పు అయింది. ఈ క్రమంలో వరి సాగు చేయొద్దని, యాసంగి వడ్లను కొనబోమని ప్రభుత్వం చెప్పడంతో అప్పులు తీర్చే మార్గం లేక నర్సయ్య తీవ్ర మనోవేదనకు గురై గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా హాస్పటల్‌కు తరలించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సర్పంచ్ పోకల రేఖ, గ్రామస్తులు కోరారు.