Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన భార్య
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా..ఆయన మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా గుండెపోటుతో మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గూడూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పోలేపల్లి లక్ష్మయ్య (52) భార్య లలితతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై నిడమనూరు మండలానికి వెళ్లి వస్తున్నారు. వారు బొక్కుమంతల పహాడ్ వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య లలితకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. భర్త మృతి చెందాడనే వార్త తెలుసుకున్న లలిత తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందింది. భార్యాభర్తలు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వారి మృతదేహాలను మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు తదితరులు సందర్శించి నివాళులర్పించారు.