Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారం రోజుల కిందట 10 ఏండ్ల బాలుడికి..
- రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఘటన
నవతెలంగాణ-శంషాబాద్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మరో ముగ్గురికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్టు వైద్యులు తెలిపారు. బుధవారం పెద్దషాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ రేచల్ రమ్య, హెల్త్ ఎడ్యుకేటర్ హుస్సేన్ వివరాలు వెల్లడించారు. వారం రోజుల కిందట విదేశాల నుంచి వచ్చిన 10 ఏండ్ల బాలుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. వారు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నివాసముంటున్నారు. అయితే ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న బాలుడి తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు పరీక్షలు చేయగా అందరికీ నెగిటీవ్ వచ్చింది. కానీ అదే బస్తీలో నివాసముండే 26 మంది శాంపిల్స్ సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపించారు. వారిలో 14 ఏండ్ల బాలికకు, 17 ఏండ్ల యువకుడికి, 31 ఏండ్ల యువతికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్టు వైద్యులు తెలిపారు. అప్రమత్తమైన వైద్యాధికారులు పాజిటివ్ వచ్చిన వారిని హోంఐషోలేషన్కు తరలించారు. వారంతా క్షేమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మున్సిపాలిటీలో ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.