Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండోది కూడా తీసుకోవాలి
- రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా వ్యాక్సిన్ ఒక డోసు వేసుకున్నంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండబోదని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ స్పష్టం చేశారు. నిర్దేశించిన గడువులో రెండో డోసును కూడా వేసుకోవాలని ప్రజలకు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని చింతల్‌బస్తీ అర్బన్ పీహెచ్‌సీని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంద శాతం మొదటి టీకా తీసుకోని వారిపైనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధనలు తేల్చాయని తెలిపారు. టీకా వేసుకున్నప్పటికీ తప్పనిసరిగా మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలను జాగ్రత్తగా జరుపుకోవాలని ఆమె కోరారు. ఆరోగ్యనామ సంవత్సరంగా 2022 నిలవాలని తమిళిసై ఆకాంక్షించారు.