Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేడుకున్నా పట్టించుకోని అధికారులు
- బాధిత రైతు ఆత్మహత్యాయత్నం
- పరిస్థితి విషమించి మృతి
- తన భర్త మృతికి ప్రభుత్వ అధికారులే కారణం :
మృతుని భార్య ఆరోపణ
నవతెలంగాణ-కొత్తగూడెం
తనకున్న భూమిని తన సోదరుడు ఆక్రమించుకున్నాడనీ, తన భూమిని తనకు ఇప్పించాలని రెవెన్యూ, పోలీసులు, జిల్లా యంత్రాంగాన్ని వేడుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు.. దాంతో సోమవారం ప్రజా దివాస్‌లో తన సమస్యను జిల్లా అదనపు కలెక్టర్‌కు విన్నవించారు.. ఎలాంటి పరిష్కారం రాలేదు.. మనస్తాపానికి గురైన రైతు గొల్లపూడి శ్రీనివాసరావు(50) ఆవేశంతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం రేపింది.
జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గొల్లపూడి శ్రీనివాసరావుకి ఉన్న 4 ఎకరాల పొలాన్ని తన సోదరుడు గొల్లపూడి శ్యాంసుందర్ అక్రమంగా ఆక్రమించుకున్నాడనీ, తన భూమి తనకు ఇప్పించాలని జూలూరుపాడు పోలీసులను ఆశ్రయించాడు. అన్ని రకాల పత్రాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దాంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి మొరపెట్టుకున్నాడు. పలు దఫాలుగా ప్రజా దివాస్‌లో వినతిపత్రాలు అందజేసినప్పటికీ ఎలాంటి చేయూత లభించలేదు. తీవ్ర మానసిక వేదనకు గురైన గొల్లపూడి శ్రీనివాస్ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పురుగుల ముందు సేవించాడు. గమనించిన స్థానికులు అతన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల పాటు చికిత్స పొందిన శ్రీనివాసరావు బుధవారం ఉదయం మృతి చెందాడు. అతని మరణానికి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుని భార్య వాణి కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పలు రాజకీయ పార్టీల నాయకులు స్పందిస్తూ.. బాధితుడికి న్యాయం చేసి ఉంటే నిండు ప్రాణం బలయ్యేది కాదనీ, ఇప్పటికైనా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి రైతు మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.