Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తామర పురుగు వల్ల నష్టపోయిన మిరప పంటను సర్వే చేసి రైతులకు నష్టపరిహారం అందించాలని సీఎం కేసీఆర్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం లేఖ రాశారు. రాష్ట్రంలో ఖమ్మం, మహబూబ్నగర్, సూర్యాపేట, వరంగల్, నల్లగొండ, కరీంనగరర్, సిద్దిపేట, తదితర జిల్లాల్లో వేసిన మిరప తోటలను వారం రోజుల్లోనే తామర పురుగు సర్వ నాశనం చేసిందని పేర్కొన్నారు. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఈ తెగులును నిర్మూలించ లేక పోయారనీ, దీంతో పంట చేతికి రాకుండా పోయిందని తెలిపారు. అందువల్ల ఎకరాకు లక్ష రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టిన రైతుల ఇప్పుడు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.