Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
నూతన జిల్లాల ఫలాలు నిరుద్యోగులకు అందాలంటే జీవో 317 రద్దు చేసి, స్థానికత ఆధారంగా ఉద్యోగులను విభజించాలని డీఎస్సీ-టీఆర్టీ అభ్యర్ధుల సంఘం ప్రధాన కార్యదర్శి మఠం శివానందస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అభివద్ధి చెందిన జిల్లాల ఉద్యోగులను కొత్తగా ఏర్పడ్డ మారుమూల జిల్లాలకు పంపిస్తే అక్కడి నిరుద్యోగులను తీవ్ర అన్యాయం చేసినట్లేననీ పేర్కొన్నారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు మారుమూల ప్రాంతాలకు పట్టణ ఉద్యోగులే నియామకం అయ్యేవారనీ, కొత్త జిల్లాలు ఏర్పడ్డాక వారిని సొంత జిల్లాలకు పంపకుండా నూతన జిల్లాలకు శాశ్వతంగా కేటాయించడం వల్ల భర్తీ చేయబోయే ఉద్యోగ ఖాళీలపై తీవ్ర ప్రభావం చూపి స్థానిక నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని వివరించారు.