Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతదేశం నుంచి ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు తగ్గాయని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్ చెప్పారు. చక్కెర, గొడ్డు మాంసం, బియ్యం రొయ్యలు వంటివి ఎగుమతుల్లో అగ్రభాగాన ఉన్నాయన్నారు. బియ్యం, గోధుమలు, చక్కెర, పత్తి, పండ్లు, కూరగాయలు, వంట నూనెల ఎగుమతులను కేంద్రప్రభుత్వం పరిమితం చేసిందని వివరించారు. బుధవారంనాడిక్కడి నక్షత్ర హౌటల్లో 'భారతదేశంలో వ్యవసాయోత్పత్తుల ఎగుమతి-తెలంగాణ అవకాశాలు' అంశంపై సదస్సు జరిగింది. దానికాయన ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. దేశంలో వ్యవసాయ యాంత్రీకరణను పెరిగిందనీ, ట్రాక్టర్ల ఉత్పత్తిలో మూడింట ఒక వంతు భారతదేశానిదేనని తెలిపారు. వ్యవసాయం సమాజానికి ఆదాయాన్ని అందిస్తూ, ఉపాధి అవకాశాలు కల్పింస్తుందన్నారు. పంటకు, పరిశ్రమలకు అనుసంధానం ఉండాలనీ, అప్పుడే రైతులకు గిట్టుబాటుధర లభిస్తుందన్నారు. భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి అంతర్జాతీయ మార్కెట్లో విస్తారమైన డిమాండ్ ఉన్నదనీ, దాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోలేకపోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో మొక్కజొన్న పంటకు వాతావరణ మార్పు వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ పోటీతత్వాన్ని కలిగి ఉందన్నారు.