Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఇటీవల అస్వస్థతకు గురై కోలుకున్న పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులు బుధవారం మంత్రి పువ్వాడ అజరుకుమార్ను ఖమ్మంనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వనజీవి రామయ్య ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా హరితహారం మొక్కలపై కాసేపు ముచ్చటించారు.