Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ ట్రాన్స్‌కో పీ అండ్ జీ అసోసియేషన్ - 2022 సంవత్సర క్యాలెండర్, లీవ్ రెగ్యులేషన్స్ పుస్తకాలను బుధవారం సంస్థ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు విద్యుత్ సౌధలో ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డైరీలు సంస్థలోని ఉద్యోగులందరికీ ఉపయుక్తంగా ఉంటాయనీ, భవిష్యత్ కార్యాచరణను దిశానిర్దేశం చేస్తాయని చెప్పారు. జేఎమ్డీ శ్రీనివాసరావు మాట్లాడుతూ క్యాలెండర్లు, డైరీలతో రోజువారీ కార్యకలాపాల సమీక్షకు ఉపయోగపడతాయనీ, అవి ఉద్యోగులకు తప్పనిసరి అని అన్నారు. ట్రాన్స్‌కో జాయింట్ సెక్రటరీ ఊర్మిళ దేవి, పీ అండ్ జీ అసోసియేషన్ అధ్యక్షులు పట్నాయక్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ,ఉపాధ్యక్షులు విజరు, జాయింట్ సెక్రటరీ రమేష్, కోశాధికారి సుకన్య, ఆర్గనైజింగ్ సెక్రేటీలు సూర్య ప్రకాష్, అమ్రీన్, కార్యనిర్వాహక సభ్యులు గీత, సుమదీక్షిత, రాజు, రాము, రూప, అశోక్ ,భరత్ తదితరులు పాల్గొన్నారు.