Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రజెండా పరిపాలనలో పేదరిక నిర్మూలన
- దేశంలో మోడీ పాలన పెట్టుబడిదారులకు దాసోహం
- సీపీఐ(ఎం) వికారాబాద్ జిల్లా 2వ మహాసభలో
- రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.జ్యోతి, జాన్‌వెస్లీ
- వికారాబాద్ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిగా మల్లేశ్
నవతెలంగాణ-రంగారెడ్డిప్రాంతీయప్రతినిధి/ రంగారెడ్డిప్రతినిధి
ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం పోరాటం చేసే ఏకైక జెండా ఎర్రజెండా అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు టి.జ్యోతి, జాన్‌వెస్లీ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్, సుందరయ్యనగర్ ప్రాంగణంలో వికారాబాద్ జిల్లా సీపీఐ(ఎం) 2వ మహాసభ.. వెంకటయ్య, చంద్రయ్య, రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభకు హాజరైన జ్యోతి, జాన్‌వెస్లీ మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికా కరోనా సమయంలో పేదరికాన్ని గాలికొదిలేసిందన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని పక్కన పెట్టి పెట్టుబడిదారులకు ఊడిగం చేసిందని విమర్శించారు. సామ్రాజ్యవాద దేశాలకు భిన్నంగా కోవిడ్ సమయంలో సోషలిస్టు దేశాలు ప్రజా ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకున్నాయన్నారు. అంతేకాదు, దేశంలోనూ ఎర్రజెండా అధికారంలో ఉన్న కేరళ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ప్రస్తుతం ప్రజల చూపు ఎర్రజెండాల వైపు ఉందనీ, భవిష్యత్ కాలం ఎర్రజెండాలదేనని తెలిపారు. అనంతరం వికారాబాద్‌లో 13 మందితో కూడిన కమిటిని ఎన్నుకున్నారు. వికారాబాద్ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిగా మల్లేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా ఆర్ మైపాల్, వెంకటయ్య, పి శ్రీనివాస్, బుగ్గప్ప, కె. శ్రీనివాస్, మంగమ్మ, రామకృష్ణ, సుభాష్, సుదర్శన్, వెంకట్ రాములు, చంద్రయ్య, సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాసభలో రాష్ట్ర నాయకులు జంగారెడ్డి, జగదీశ్‌తో పాటు జిల్లా నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.