Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చిన ముప్పారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి జైత్రాం జిల్లాల కేటాయింపులతో కలత చెంది మరణించారనీ, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యుఎస్పీసీ) డిమాండ్ చేసింది. ఈమేరకు గురువారం యుఎస్పీసీీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన్ను మహబూబాబాద్ జిల్లా నుంచి ములుగు జిల్లాకు కెేటాయించటంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారని పేర్కొన్నారు. కేవలం జీవో 317 సష్టించిన అస్తవ్యస్త పరిస్థితి కారణంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుని కుటుంబానికి న్యాయం చేయాలనీ, జీవో 317ను సమీక్షించి మరిన్ని అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిరోధించాలని కోరింది. యుఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, మైస శ్రీనివాసులు, టీఎస్ యుటీఎఫ్,టీపీటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు, పలువురు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జైత్రాం మతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం జూమ్ సమావేశంలో యుయస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చావరవి, మైస శ్రీనివాసులు, ఎం రఘుశంకర్రెడ్డి, టి లింగారెడ్డి, డి సైదులు, ఎన్ యాదగిరి, ఎస్ హరికృష్ణ, బి కొండయ్య, ఎ గంగాధర్ మాట్లాడుతూ జీవో 317తో అన్యాయం జరిగిందనీ, అందుకోసం దశలవారీగా ఉద్యమిస్తామని తెలిపారు.