Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరి ప్రవర్తిస్తే, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. చట్ట వ్యతిరేకంగా పబ్స్ వ్యవహరించినా, మైనర్లను అనుమతించినా ఉపేక్షించవద్దని హెచ్చరించింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు జారీ చేసిన షరతులు/నిబంధనలను జనవరి 4వ తేదీ వరకూ అమలు చేయాలని చెప్పింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ జారీ చేసిన ప్రకటన బాగుందని కొనియాడింది. దాన్ని అమలు చేయాలని గురువారం జస్టిస్ బీ విజరుసేన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పబ్స్, ఈవెంట్స్ నిర్వహించే చోట్ల హెచ్చరిక బోర్డులు పెట్టాలనీ, కరోనా గైడ్స్లైన్స్ అమలు చేయాలని, నిబంధనలను అతిక్రమిస్తే వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగానే పరిమితులు ఉండాలని, సిబ్బంది 48 గంటల ముందు కోవిడ్ వైద్య పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లుగా సర్టిఫికెట్ ఉంటేనే అనుమతించాలని, శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలని, ఆ ప్రాంతాలను శానిటైజ్ చేయాలని, ఆహార, వినియోగించే పాత్ర సామాగ్రి, ఇతర వస్తువుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పోలీసులకు ఆదేశాలిచ్చింది. 45 డిసెబుల్స్ మించి శబ్ధం రాకూడదని, సింగర్స్ జనంలోకి వెళ్లకూడదని, బార్లు, రెస్టారెంట్లల్లో లైవ్ బ్యాండ్స్ ఏర్పాట్లు చేయరాదనీ. అసభ్య నత్య ప్రదర్శనలు చేయరాదని షరతులు విధించింది. విచారణను జనవరి 6కి వాయిదా వేసింది.