Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన 44 మందికి కీర్తి పురస్కారాలు ప్రకటించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ గురువారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. నాట్యం, నాటకం, అవధానం, పత్రికారచన, మహిళాభ్యుదయం, గ్రంథాలయం, జానపదకళలు, సంఘసేవ, ఇంద్రజాలం, లలితసంగీతం, జ్యోతిష్యం, కార్టూన్, గజల్, నిరంతర విద్య తదితర రంగాల్లో సేవలు అందించిన వారికి జనవరిలో ఈ పురస్కారాలు అందచేస్తామని ఆయన తెలిపారు. ఆచార్య మాడభూషి శ్రీధర్ (ఆధ్యాత్మిక సాహిత్యం), మరిపాల శ్రీనివాస్ (జీవితచరిత్ర), జావేద్ (కార్టూన్), ఆచార్య దొర్తి ఐజాక్ (గ్రంథాలయ సమాచార విజ్ఞానం) తదితరులకు ఈ పురస్కారాలు లభించాయి.