Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ, ఏపీ సీఎస్‌లకు కేంద్రం లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించిన విభజన అంశాలపై చర్చించేందుకు జనవరి 12న ఢిల్లీకి రావాలంటూ కేంద్రం... రెండు రాష్ట్రాలకూ సూచించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజరు కుమార్ భల్లా గురువారం లేఖ రాశారు. 12న ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న హైదరాబాద్‌లోని సంస్థలను విభజించాల్సి ఉంది. షెడ్యూల్ 10లో ఉన్న 107 సంస్థల్లో 97 హైదరాబాద్‌లోనే ఉన్నాయి. షెడ్యూల్ 9లో మరో 89 సంస్థలున్నాయి. వీటి పరిధిలో ఉన్న వేలకోట్ల విలువైన ఆస్తులు, భూములు, భవనాలు, బ్యాంకు డిపాజిట్లను రెండు రాష్ట్రాలకు పంచాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి అంశాలన్నింటినీ పరిష్కరించాలంటూ ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినా, కేంద్రం ఈ అంశంపై గత ఏడేండ్లుగా పెద్దగా దృష్టి సారించకపోవటం గమనార్హం.