Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆన్లైన్ అభ్యాస వేదిక క్యాల్కసిండియా నూతన సంవత్సరం సందర్బంగా 'వన్ పాస్.. ఆల్ ఎగ్జాంస్' కూపన్ను ప్రకటించింది. దీన్ని గురువారం రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ లాంచనంగా విడుదల చేశారు. నాణ్యమైన విద్యను పేద, మధ్య తరగతి వర్గాల వారికి అందుబాటులో ఉండేలా ఈ ఆఫర్ను ప్రకటించిన సంస్థ వ్యవస్థాపకులు వాణీకుమారిని మంత్రి అభినందించారు. కేవలం రూ.99 ప్రీమియం ప్యాకేజీ తీసుకోవటం ద్వారా విద్యార్ధులు యాప్లో ఉన్న పాఠశాల స్థాయి నుండి సివిల్ ఎంట్రన్స్ వరకు మొత్తం 1549 కాటగిరీల పరీక్షల నుండి 61150 కు పైగా టెస్టులను 6 నెలల పాటు సాధన చేయవచ్చని క్యాల్కస్ ఎడ్యూకేషనల్ ఇన్స్ట్యూట్ సిఇఒ క్రిష్ణా తెలిపారు. అందుబాటు ధరల్లో అందరికీ విద్య తమ ఉద్దేశ్యమన్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి తమ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కొన్ని ఉచిత పరీక్షలను ప్రాక్టిస్ చేసి నచ్చిత తమ ప్రీమియం సభ్యత్వం తీసుకోవచ్చన్నారు.