Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికేంద్రీకరణ పేరిట అధికార కేంద్రీకరణ : సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా ప్రథమ మహాసభలో పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయప్రతినిధి
కేంద్రంలో బీజేపీ మతోన్మాద వైఖరిని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సీపీిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం వరంగల్ నగరంలోని శంభుని పేటలో కామ్రేడ్ పిన్నింటి తిరుపతిరెడ్డినగర్లో సీపీఐ(ఎం) ఎం.సాగర్ అధ్యక్షతన నిర్వహించిన వరంగల్ జిల్లా ప్రథమ మహాసభ ప్రారంభసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా అవసరముందన్నారు. సోవి యట్లో కమ్యూనిజం పోయినా మళ్లీ ముందుకు వస్తుందనీ, చిలీ వంటి దేశంలో ప్రగతిశీల శక్తులు మళ్లీ అధికారంలోకి వచ్చాయని తెలిపారు. ప్రజలను సమీకరించి ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడితే మనం కూడా విజయం సాధిస్తామ న్నారు. కేంద్రప్రభుత్వం 4 లేబర్కోడ్లను తీసుకురావడంతో కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు హక్కులూ కోల్పోతున్నా రన్నారు. 8గంటల విధానం పోయి వెట్టి చాకిరి చేయాల్సి వస్తుందనీ, సంఘాలు పెట్టుకునే హక్కు కార్మికులు కోల్పో తారని తెలిపారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మెకు దిగారని తెలిపారు. కేంద్రం తెచ్చిన వ్యవ సాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాదిపాటుగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమించారని గుర్తుచేశారు. 700 మంది రైతుల త్యాగఫలితంగా ఎట్టకేలకు ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పి వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని తెలి పారు. అంతేకాదు, విద్యుత్ సవరణ బిల్లును రాష్ట్రాలు అమ లు చేస్తేనే అప్పులిస్తామని కేంద్రం, రాష్ట్రాలకు చెబుతూ కేం ద్రం ఒత్తిడి చేస్తోందని విమర్శించారు. ఈ బిల్లులు అమల యితే.. ఉచిత విద్యుత్ ఉండదనీ, పైగా వ్యవసాయ రంగం లో మోటర్లకు మీటర్లు అమర్చి విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తారన్నారు. ఏపీలోని శ్రీకాకుళంలో ఇప్పటికే మోటర్లకు మీటర్లు అమర్చారనీ, నెలకు రూ.9 వేల వరకు కరెంటు బిల్లు వస్తుందని చెప్పారు. విద్యుత్ చట్టాన్ని ందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోనూ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధమైందని తెలిపారు.
కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు నిర్వహించడంతో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్లు లేక క్లాసులు వినని పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యారన్నారు. రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్‌ఇయర్‌లో చాలా మంది ఫెయిలయ్యా రనీ, ఆందోళన చేస్తే అందరినీ పాస్ చేశారని గుర్తుచేశారు. కేరళలో మార్క్సిస్టు ప్రభుత్వం పేద విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయం కల్పించిందనీ, ఈ పని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేసి ఉంటే.. పేద విద్యార్థులకు విద్య అందుబాటులోకి వచ్చేదని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వికేంద్రీకరణ పేరిట అధికార కేంద్రీకరణ జరుగుతుందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు కైమా చేయడమంటే చాలా ఇష్టమనీ, అందుకే రాష్ట్రంలో జిల్లాలను కైమా చేసినట్టు చేసేసి.. పాలనా వికేంద్రీకరణ కోసమే జిల్లాలు చేసినట్టు చెబుతున్నారన్నారు. కానీ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకొని జిల్లాలకు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. ఎన్టీఆర్ పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండలాలను ఏర్పాటు చేసినప్పుడు ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందనుకున్నామనీ, తర్వాత అవినీతి భారీగా జరిగిందనేది అర్ధమైందన్నారు. వికేంద్రీకరణ అంటే కేంద్ర ప్రభుత్వం సంపదను రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. కాని ప్రధాని మోదీ రాష్ట్రాల నుంచి పన్నులు వసూలు చేస్తూ రాష్ట్రాలకు వాటా ఇవ్వడం లేదని ఆరోపించారు. దాంతో రాష్ట్రాలకు నిధులు లేకుండా పోయాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్‌లో పోరాటాలకు ప్రజలు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మహాసభలో కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు నలిగంటి రత్నమాల, సీనియర్ నాయకులు కె. వెంకటయ్య, సీపీఐ(ఎం) హన్మకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు ఎం. చుక్కయ్య, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.