Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు... ఈ సంవత్సరానికి మట్టి పరిమళానికి పట్టం కట్టిందని తెలంగాణ సాహితి పేర్కొంది. పాటల్లో పెల్లుబికిన పల్లె పదాల సొబగుకు ప్రణమిల్లందని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షుడు వల్లభాపురం జనార్థన, ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా అవార్డుకు ఎంపికైన ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న (కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు), తగుళ్ల గోపాల్ (కేంద్ర సాహిత్య యువ పురస్కారం), ప్రముఖ సైన్సు రచయిత దేవరాజు మహారాజు (బాల సాహిత్య పురస్కారం)కు వారు అభినందనలు తెలిపారు.