Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శుక్రవారం ఒక్కరోజే 311 పాజిటివ్ కేసులు
- ఇద్దరు మృతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 311 కరోనా కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ బులిటెన్లో పేర్కొంది. ఇద్దరు మృతి చెందారు. ఇవాళ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులేమీ కొత్తగా నమోదు కాలేదు. ఇప్పటి వరకూ మన రాష్ట్రంలో 67 ఒమిక్రాన్ కేసులున్నట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 198 కరోనా పాజిటివ్ కేసులు రావడం ఆందోళన పరుస్తున్నది. ఆ తర్వాత అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 32, రంగారెడ్డి జిల్లాలో 28 కేసులు వచ్చాయి. జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, కామారెడ్డి, కొమ్రంభీం అసిఫాబాద్, ములుగు, మెదక్, నారాయణపేట, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, వికారాబాద్, వరంగల్ రూరల్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.