Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని గవర్నర్ ఆకాంక్షించారు. 2022లో సమానత్వం, సౌభ్రాతృత్వం, శాంతి, సహనం వర్థిల్లాలని పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో కోవిడ్ నిబంధనలను పాటించటం ద్వారా ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతీయేటా తమ ప్రభుత్వం వినూత్న పంథాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ సబ్బండ వర్గాలు ప్రగతి పథాన పురోగమించేలా చర్యలు చేపడుతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. 2022లో కూడా కష్టాలను అధిగమిస్తూ అదే అకుంఠిత దీక్షతో సుపరిపాలనను కొనసాగిస్తామని పేర్కొన్నారు. తద్వారా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని సీఎం ఆకాంక్షించారు.