Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణం సవరించాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల క్యాడర్ విభజన, బదిలీలకు సంబంధించిన జీవో 317తో తీవ్ర గందరగోళం ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్షణం ఈ జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ఆ జీవో కారణంగా పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ సొంత జిల్లాలలోనే స్థానికేతరులు అవుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికే ఇది విరుద్దమని తెలిపారు. వస్త్రాలపై కేంద్రం విధించిన 12 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత పరిశ్రమ చితికిపోయే ప్రమాదం వున్న క్రమంలో వస్త్రాలపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 12 శాతానికి పెంచడంతో చేనేత పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని తెలిపారు. ప్రజలపై ఈ విధంగా పన్నుల భారం మోపి కేంద్ర ప్రభుత్వం పబ్బం గడుపుకోవడాన్ని చాడ విమర్శించారు.