Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోనియాకు రాసిన లేఖ లీకుపై బుకాయింపు
- క్రమశిక్షణా సంఘం ముందుకు పిలుస్తాం : చిన్నారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సంగారెడ్డి ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి గీతదాటారని టీపీసీసీ క్రమశిక్షణా సంఘం తేల్చింది.ఆయన పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించారని నిర్ధారించింది. రేవంత్‌రెడ్డిపై సోనియాగాంధీకి రాసిన లేఖ ఎలా బహిర్గతమైందో జగ్గారెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుందని వివరించింది. ఇదే అంశంపై శుక్రవారం గాంధీభవన్‌లో క్రమశిక్షణా సంఘం చైర్మెన్ జి చిన్నారెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశమైంది. అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పార్టీలో ఏమైనా విభేదాలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డిని త్వరలోనే కమిటీ ముందుకు పిలుస్తామని వెల్లడించారు. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అంశం తమ పరిధిలోకి రాదని తెలిపారు. సోనియాకు జగ్గారెడ్డి రాసిన లేఖ ఎలా బహిర్గతమైందో వివరణ కోరుతామన్నారు. ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలనే అంశాన్ని రేవంత్ తనతో చర్చించలేదని జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గతంలోనూ రేవంత్‌పై జగ్గారెడ్డి బహిరంగ వ్యాఖ్యలు చేశారనీ, ఆ సమయంలో 'మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనంటూ అప్పట్లో క్షమాపణలు కూడా చెప్పారు' అని పేర్కొన్నారు. ఇదే అంశం ఆయన్ను నుంచి మళ్లీ పునరావృత్తమైందని చెప్పారు. కొత్త సంవత్సరంలో కొత్త సంస్కృతిని ఆచరిస్తామన్నారు. పలువురు నేతలు అనుసరిస్తున్న క్రమశిక్షణా చర్యలపై చర్చించినట్టు ఆయన తెలిపారు.