Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోర్తాడ్
కన్న కూతురుపై లైంగికదాడికి ఒడిగట్టిన తండ్రికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ జిల్లా కోర్టు తీర్పునిచ్చినట్టు వేల్పూర్ ఎస్ఐ సురేశ్ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన నిందితుడు 2014లో కుమార్తెపై లైంగిక దాడి చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితున్ని కోర్టుకు హాజరుపరచగా వాదోపవాదనలు విన్న నిజామాబాద్ జిల్లా అడిషనల్ జడ్జి శుక్రవారం 20 సంవత్సరాల జైలు శిక్ష, ఐదువేల రూపాయలు జరిమానా విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.రవిరాజ్ కేసు వాదించగా, ఆధారాలను పొందుపర్చడంతో జడ్జి నిందితునికి శిక్ష ఖరారు చేశారు.