Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
వస్త్రపరిశ్రమపై జీఎస్టీని తాత్కాలికంగా వాయిదా వేయడం కాదు...పూర్తిగా రద్దు చేయాలని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ), తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఓ ప్రకటనలో డిమాండ్ చేశాయి. ఈ అంశంపై కేంద్రం స్పష్టమైన విధాన నిర్ణయాన్ని ప్రకటించాలని కోరాయి. వస్త్రాలు, చేనేత, మరమగ్గాలు, సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేసేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా తన వైఖరి ప్రకటించాలనీ, కేంద్రం తాత్కాలికంగా వాయిదా వేయడాన్ని గొప్పగా కీర్తించొద్దని సూచించాయి. మున్ముందు జీఎస్టీ అమలైతే చేనేత కార్మికులు, పవర్లూం కార్మికులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఆయా సంఘాల ప్రధాన కార్యదర్శులు కూరపాటి రమేష్, బడుగు శంకరయ్య ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.