Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శిగా సిహెచ్.రంగయ్య ఎన్నికయ్యారు. వరంగల్ నగరంలోని కామ్రేడ్ పిన్నింటి తిరుపతిరెడ్డి ప్రాంగణంలో సీపీఐ(ఎం) జిల్లా మహాసభ డిసెంబర్ 30, 31 తేదీల్లో జరిగింది. ఈ సందర్భంగా 18 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శి వర్గంగా ఏడుగురు ఎన్నికయ్యారు. రంగయ్యతోపాటు నలిగంటి రత్నమాల, సింగారపు బాబు, ముక్కెర రామస్వామి, ఈసంపెల్లి బాబు, భూక్య సమ్మయ్య, కుమారస్వామి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.