Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదే అంశంపై గవర్నర్‌తమిళిసైకి బీజేపీ బృందం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీవో 317ను సవరించాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌తో బీజేపీ బృందం భేటీ అయ్యింది. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగుల ఇబ్బందులను గవర్నర్‌కు వివరించామని తెలిపారు. మరొకసారి సకల జనుల సమ్మె జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఉద్యోగుల బదిలీల్లో తీవ్ర అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయని తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులకు బీజేపీ వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. ఉద్యోగులను హింసించిన పాపం కేసీఆర్‌కు తగిలి తీరుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులను పిలిచి చర్చించే వరకు బదిలీల ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చి 40నెలలు దాటినా తెలంగాణ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శిం చారు. ఉపాధ్యాయ,ఉద్యోగులను సంప్రదించకుండా 317జీవోను తీసుకొచ్చారన్నారన్నారు. ప్రభుత్వం దగ్గరున్న సీనియారిటీ లిస్ట్ అంతా తప్పుల తడకే అని ఆరోపించారు. గవర్నర్‌ని కలిసిన బృందంలో బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, మండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్, బీజేపీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, సీహెచ్ విఠల్, మోహన్‌రెడ్డి, ఎస్.కుమార్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శృతి, గీతామూర్తి, తదితరులు ఉన్నారు.