Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండ్లేండ్ల తర్వాత నేటి నుంచి ప్రారంభానికి అంతారెడీ
- 45 రోజులపాటు కొనసాగనున్న 81వ అఖిలభారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన
- ఏర్పాట్లు పూర్తయినట్టు ప్రకటించిన నాంపల్లి ఎగ్జిబిషన్ కమిటీ
- ప్రారంభించనున్న గవర్నర్ తమిళిసై
నవతెలంగాణ- సుల్తాన్‌బజార్
న్యూఇయర్ సంతోషంతోపాటు నుమాయిష్ సంబురం కూడా నేటి నుంచి సందర్శకులను, నగరవాసులను అలరించనుంది. రెండేండ్ల తరువాత 81వ అఖిలభారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన మొదలవుతోంది. జనవరి ఒకటి నుంచి 45 రోజులపాటు జరగనున్న ఎగ్జిబిషన్‌కు ఏర్పాట్లు పూర్తి చేశామని సొసైటీ శుక్రవారం ప్రకటించింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే వస్త్ర, వస్తు ప్రదర్శన (నుబాయిష్) కోసం జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, పోలీస్, విద్యుత్ శాఖల నుంచి పర్మిషన్ తీసుకున్నట్టు తెలియజేసింది.
అంతా కోవిడ్ రూల్స్ ప్రకారమే..
నుమాయిష్ ప్రదర్శన హైకోర్టు మార్గదర్శకాలు, కోవిడ్ రూల్స్ ప్రకారం కొనసాగనుంది. కరోనా, ఒమిక్రాన్ నేపథ్యంలో స్టాళ్ల సంఖ్యను 1600కు కుదించారు. కోవిడ్ రూల్స్ పాటిస్తూ నుమాయిష్‌ను సక్సెస్ చేస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రభాశంకర్ చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, జమ్మూ కశ్మీర్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల స్టాళ్లు నుమాయిష్‌లో దర్శనమివ్వనున్నాయి.
అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు
నాంపల్లి వస్తు ప్రదర్శనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులతో సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. స్టాళ్ల వద్ద తనిఖీ చేశారు. ఫైర్, ఎలక్ట్రికల్, జీహెచ్ఎంసీ,విద్యుత్ తదితర శాఖల నుంచి పర్మిషన్లు వచ్చాయని, వాటన్నింటినీ సీపీకి సమర్పించామని తెలిపారు. ప్రయివేటు సెక్యురిటీతో పాటు పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.ప్రతి స్టాల్లో 8 కేజీల ఫైర్ రెడ్యుసింగ్ సిలిండర్ అందుబాటులో ఉంటుందని చెప్పారు.మైదానంలో వంట చేసేందుకు అనుమతి లేదన్న ఆయన నుమాయిష్‌కు వచ్చే ప్రజల కోసం గేట్ల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఎగ్జిబిషన్ సందర్భంగా మెట్రో, ఆర్టీసీ ఎక్కువ సర్వీసులు అందించాలని కోరినట్టు ఎగ్జిబిషన్ కమిటీ సభ్యులు తెలిపారు. కరోనా టెస్టింగ్, టీకా స్టాల్ డెస్కులు అందుబాటులో ఉంటాయన్నారు.
ప్రారంభించనున్న గవర్నర్
నుమాయిష్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించనున్నట్టు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు. 20 ఎకరాల విస్తీర్ణంలోని మైదానంలో ఆరెకరాల స్థలంలోనే స్టాళ్లు ఏర్పాటు చేయగా, మిగిలిన స్థలాన్ని సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు, పార్కింగ్‌కు ఉపయోగించనున్నట్టు తెలిపారు. నో మాస్క్.. నో ఎంట్రీ పద్ధతిని అమలు చేస్తామని చెప్పారు.