Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఈపై ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఫైర్
- ట్రాన్స్ఫార్మర్ల కోసం డబ్బులు వసూలు
నవతెలంగాణ - కొత్తకోట
ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే నీ సంగతి తేలుస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి విద్యుత్ శాఖ ఏఈని హెచ్చరించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వచ్చిన ఎమ్మెల్యేకు శుక్రవారం రైతులు, ప్రజలు ఏఈపై ఫిర్యాదు చేశారు. వ్యవసాయ మోటార్ల ట్రాన్ఫార్మర్ల కోసం తమ నుంచి రూ.20 వేలు వసూలు చేసి కాలయాపన చేస్తున్నారని, అడిగితే ఇంకా రాలేదని బుకాయిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ఏఈని పిలిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి 30 ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చామని, కానీ రైతుల నుంచి ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏడు మండలాల్లో లేని సమస్య ఇక్కడెందుకుందని, తీసుకున్న డబ్బులకు ఎందుకు రషీదులు ఇవ్వడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని, రైతుల నుంచి డబ్బులు వసూలు చేసే తమరు ఇక్కడెందుకన్నారు. వెంటనే రైతుల డబ్బులు తిరిగి చెల్లించాలని సూచించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రజలకు పని చేయాలని, లేకుంటే ఇక్కడ అవసరం లేదని హెచ్చరించారు.