Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన మల్లన్నపల్లె గ్రామస్తులు
నవతెలంగాణ-చొప్పదండి
గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల మల్లన్నపల్లె గ్రామ మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామంలో డంపింగ్ యార్డు కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని శుక్రవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. రెండేండ్లుగా చొప్పదండి మున్సిపాలిటీ నుంచి తెచ్చిన చెత్తను తమ గ్రామ సమీపంలో వేస్తున్నారని చెప్పారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దని తహసీల్దార్, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ పనులు ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే రవిశంకర్‌ను మహిళలు అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో ఎమ్మెల్యే రవిశంకర్ ప్రారంభించకుండా వెళ్లిపోయ్యారు.