Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వస్త్ర పరిశ్రమమీద జీఎస్టీపై తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని తాత్కాలికంగా వాయిదా వేయటం కాదు..పూర్తిగా రద్దు చేయాలని రద్దు చేయాలని సీపీఐ(ఎం) కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి తర్వాత ఐదు శాతం ఎస్టీని వస్త్ర పరిశ్రమపై మోపిందని గుర్తుచేశారు. ఇది సరిపోదన్నట్టుగా అదనంగా మరో ఏడు శాతాన్ని విధించడం దుర్మారమని తెలిపారు. దీని వల్ల చేనేత, మరమగ్గాలపై పనిచేసే కార్మికులు, వారి కుటుంబాలు, బట్టల దుకాణదారులు, అందులో పనిచేసే అన్స్కిల్డ్ వర్కర్స్, పత్తిరైతు కుటుంబాలు రోడ్డునపడతాయని పేర్కొన్నారు. జీఎస్టీని ఎత్తేయటం ద్వారా వస్త్ర పరిశ్రమను, అందులో పనిచేస్తున్న కార్మికులను, కర్షకులను కాపాడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ రంగం రక్షణకోసం జనవరి మొదటివారంలో ఆయా అసోసియేషన్లు చేయబోతున్న ఆందోళనకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని తెలిపారు. దేశంలో కోట్లాది మందికి ఉపాధినిస్తున్న వస్త్ర, చేనేత పరిశ్రమను దృష్టిలో పెట్టుకుని గత పాలకులు ఈ రంగంపై పన్నులు విధించలేదని గుర్తుచేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి ఐదు శాతం జీఎస్టీ విధిస్తున్నదని తెలిపారు. అదనంగా మరో ఏడు శాతం కలిపి మొత్తం 12 శాతం జీఎస్టీ అమలు చేయడానికి పూనుకోవటమంటే ఆ పరిశ్రమను దివాళా తీయించటమేనని తెలిపారు. దేశవ్యాప్తంగా అనాదిగా ఈ పరిశ్రమపై కోట్లాది మంది చేనేత, జౌళిరంగంలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే వస్త్ర, చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న మొత్తం జీఎస్టీ, ఇతర పన్నులను రద్దు చేసి ఈ రంగాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.