Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిగిలిన సీట్లకు నాలుగు నుంచి వెబ్ఆప్షన్ల నమోదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో 2021-23 బ్యాచ్ ప్రవేశాల కోసం డీసెట్ అభ్యర్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డీసెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. ఈనెల నాలుగు నుంచి ఆరో తేదీ వరకు అభ్యర్థులు వెబ్ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశముందని తెలిపారు. ఎనిమిదిన సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. అదేనెల తొమ్మిది నుంచి 11 వరకు ఫీజు చెల్లించాలనీ, కేటాయించిన కాలేజీ లెటర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 17 నాటికి కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. డీసెట్ మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో వెబ్ఆప్షన్లు నమోదు చేయని వారు, సీట్లు కేటాయించినా కాలేజీల్లో రిపోర్టు చేయని వారు, ఫీజు చెల్లించని వారు ప్రస్తుతం వెబ్ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు. ఇతర వివరాలకు ష్ట్ర్‌్‌జూ://సవవషవ్. షసరవ.్‌వశ్రీaఅస్త్రaఅa. స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.