Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీపై మోహన్ ప్రకాష్ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాని మోడీ దేశ ప్రజలకు కొత్తేడాది కానుకగా ద్రవ్యోల్బణాన్ని అందించారని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి మోహన్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలపై తీవ్రమైన భారంపడుతున్నదని చెప్పారు. శనివారం గాంధీభవన్‌లో పార్టీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. అన్ని వస్తువులపై జీఎస్టీ విధించటం ద్వారా కేంద్రం సామాన్యుల నడ్డివిరుస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 5శాతం నుంచి 12 శాతానికి పెంచిందని తెలిపారు. సింథటిక్, నూలు, దుప్పట్లు, గుడారాలు, టేబుల్క్లాత్ తదితర వస్తువులపై ధరలు అమాంతం పెరిగాయనీ, వాటిపై వెంటనే జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేశారు. 2014 అధికారంలోకి మోడీ వచ్చే సమయానికి లీటర్ పెట్రోల్ ధర రూ 71, లీటర్ డీజిల్ ధర రూ 56, వంటగ్యాస్ ధర రూ 400 ఉన్నదనీ, వాటి ధరలు మూడువందల రెట్లు పెరిగాయని విమర్శించారు. పప్పు దినుసులు, కూరగాయలు, పండ్ల ధరలు సైతం పేదలకు భారంగా మారాయని చెప్పారు. వీటితో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.