Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డైరీ ఆవిష్కరించిన నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెంట్రల్ ఫోరం ఉద్యోగుల డైరీ-2022ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుప్రసిద్ధ సీనియర్ నటి సి. కృష్ణవేణి జీవిత చరిత్ర 'కృష్ణవేణి తరంగాలు' అనే పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు ఆర్ నారాయణమూర్తి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.
అధికారుల శుభాకాంక్షలు
వ్యవసాయ శాఖకు చెందిన ఉన్నతాధికారులు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రికి కమిషనర్ రఘునందన్‌రావు, విత్తనాభివృద్ధి సంస్థ ఎమ్డీ కేశవులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం పీహెచ్డీ విద్యార్థులు, శాస్త్రవేత్తలు, రిటైర్డ్ వ్యవసాయ అధికారులు, విద్యుత్ శాఖ 1104 ఉద్యోగులు, విత్తనాభివృద్ధి సంస్థ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వనపర్తి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో మంత్రి టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.త్వరలో నూతన కలెక్టరేట్, నూతన మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రారంభించనున్నట్టు తెలిపారు. రోడ్ల విస్తరణ, డబుల్బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులను తర్వగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.