Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా నివేదికలో 96.74 శాతంతో రాష్ట్రం ఆదర్శంగా నిలవడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తదితర పథకాలతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. దేశంలో 5,82,903 ఆవాసాలుండగా, కేవలం 26,138 ఆవాసాల్లో మాత్రమే బహిరంగ మల విసర్జన రహిత కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. అందులో సగానికి మించి 13,737 ఆవాసాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.