Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీఆర్టీయూటీఎస్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను మంత్రులు కె తారక రామారావు, పి సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజరు శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఈ సందర్భంగా ప్రస్తుతం జీవోనెంబర్ 317తో ఇబ్బంది పడుతున్న జూనియర్ ఉపాధ్యాయుల సమస్యలను మంత్రులకు వివరించారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టును జోనల్ క్యాడర్‌గా మార్చుటకు, జిల్లా మారిన ఉపాధ్యాయులను భవిష్యత్తులో ఏర్పడే ఖాళీల్లో తిరిగి సర్వీస్ నష్టపోకుండా వారి సొంత జిల్లాఉ బదిలీ జరిగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామనీ, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.