Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పి సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మెన్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిశారు. డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు, పురపాలక శా ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, పరిశ్రమల శాఖ విభాగాల అధిపతులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల అభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా ఈ ఏడాదిలో సుఖసంతోషాలు, ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.