Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీఆర్టీయూ తెలంగాణ నూతన డైరీ, క్యాలెండర్‌ను మంత్రులు కె తారక రామారావు, మహమూద్ అలీ, జి జగదీశ్‌రెడ్డి, పి సబితా ఇంద్రారెడ్డి, వి శ్రీనివాస్‌గౌడ్ శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి నేతృత్వంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డైరీ, క్యాలెండర్‌ను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ గౌరవాధ్యక్షులు పర్వతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.