Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నతాధికారులకు సీఎస్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లో ఒమిక్రాన్, కరోనా కేసులు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో శనివారం ఆయన హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో సమీక్షిం చారు. ప్రదర్శనలు, బహిరంగ సభలు, మత, రాజకీయ, సాంస్కృతిక తదితర అన్ని రకాల సామూహకంగా జనం గుమిగూడే సమావేశాలపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు. ప్రజా రవాణా వాహనాలు, షాపింగ్ మాల్స్‌లో మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా, ప్రవేశాల మార్గాల వద్ద థర్మామీటర్, థర్మల్ స్కానర్‌తో పరీక్షించాకే అనుమతించాలని సూచించారు. అదే విధంగా భౌతిక బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలనీ, లేదంటే రూ.1000 జరిమానా విధించాలని సూచించారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు, సీఎం ఓఎస్ డీ డాక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.