Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంథా మార్చుకోకపోతే శిక్షతప్పదు
- మావోయిస్టు పార్టీ జేఎండబ్ల్యూపీ డివిజన్ కార్యదర్శి వెంకట్ పేరుతో హెచ్చరిక లేఖ
నవతెలంగాణ-వెంకటాపురం
గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆదివాసీ ఇసుక సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక మాఫియా కాంట్రాక్టర్లను హెచ్చరిస్తూ ఆదివారం ఒక లేఖను విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ జేఎండబ్య్లూపీ (జయశంకర్, ములుగు, వరంగల్, పెద్దపల్లి జిల్లాల) డివిజన్ కార్యదర్శి వెంకట్ పేరుతో విడుదలయిన ఈ లేఖ ఆదివారం సామాజిక మాద్యమాల్లో కలవరం లేపింది. ఇసుక మాఫియా గిరిజన ప్రాంతాల్లో చొరబడి ఆదివాసీలను గ్రూపులుగా విడదీస్తూ వారి మధ్య వివాదాలు సృష్టిస్తూ వారి ఐక్యతను దెబ్బతీస్తున్నారనీ, వారు తమ పద్ధతి మార్చుకోకపోతే శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు. గిరిజన సొసైటీలను దక్కించుకున్న మాఫియా ఒకరికి తెలియకుండా, మరొకరి వద్ద మొత్తం నలుగురు, అయిదుగురు కాంట్రాక్టర్లకు అమ్ముకుని కోట్ల రూపాయలు తెచ్చుకుం టున్నారని పేర్కొన్నారు. గ్రామ వికాసాలకు ఎటువంటి పనులు చేయకపోగా, వస్తున్న అభివృద్ధి పనులనూ ఆపుతూ ప్రజలపై అభాండాలు వేస్తున్నారని తెలిపారు. స్దానికేతరుడైన ప్రభాకర్ చౌదరి ఇసుక మాఫియాను ప్రోత్సహించి అక్రమ వ్యవహరాలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. అతను ఇసుక ర్యాంపులు నడిపిన చోటల్లా ప్రజలను మోసగించినట్టు ఆరోపించారు. ప్రజలు, భూ పట్టాదారులు, ట్రాక్టర్దారులకు కూడా భారీ మొత్తంలో డబ్బులు ఎగ్గొట్టినట్టు తెలిపారు. అదేవిధంగా ముళ్లకట్ట, రాంపూర్ ఇసుక ర్యాంపుల వద్ద కోదాడకు చెందిన పి.శ్రీను క్యారీల వద్ద ఇలాగే వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇకనైనా వారు తమ పద్ధతి మార్చుకోనట్లయితే ప్రజల చేతిలో శిక్షతప్పదని లేఖలో హెచ్చరించారు.