Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 10 రోజుల పాటు రైతు సంబరాలు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. రైతుల ఖాతాల్లో రూ.50 వేలు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వేయనున్న నేపథ్యంలో ఆదివారం ఆయన టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 10 నాటికి రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని స్పష్టం చేశారు. దేశ చరిత్రలోనే ఇంత మొత్తం వేయటం మొదటిసారని చెప్పారు. ఏ పీఎం, సీఎం చేయలేనంత గొప్ప కార్యక్రమాలను వ్యవసాయ రంగం కోసం చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి గొప్ప సందర్భాన్ని వేడుకగా చేసుకుందామని పిలుపునిచ్చారు. సోమవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రైతుబంధు ఉత్సవాలను నిర్వహించాలని కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో విధించిన పరిమితులను గుర్తించుకొని శ్రేణులకు కేటీఆర్ సూచించారు. ఎమ్మెల్యేలు ఈ విషయంలో ముందుండి నియోజకవర్గ పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు.