Authorization
Fri April 11, 2025 06:21:33 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీవోనెంబర్ 317పై గందరగోళం సద్దుమనగాలంటే ఉద్యోగ ప్రకటనలను వెంటనే జారీ చేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు డిమాండ్ చేశారు. స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా సీనియార్టీ ఆధారంగా జిల్లా, జోన్, మల్టీ జోన్ వారీగా కేటాయింపులను ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానికత కాని వేరే జిల్లాకు కేటాయించిన వారు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.