Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్థానికతకు ప్రాధాన్యతనివ్వని జీవోనెంబర్ 317ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సెంకడరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కరివేద మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 317 జీవోకు వ్యతిరేకంగా సోమవారం నుంచి పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు నిరసన తెలపనున్నట్టు తెలిపారు. ఈ పోరాటంలో బాధిత ఉపాధ్యాయులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆ జీవో వల్ల అనేక మంది ఉపాధ్యాయుల కుటుంబాలు చిన్నాభిన్నమై శాశ్వతంగా వారి స్థానికతను కోల్పోయే ప్రమాదముందని తెలిపారు. నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులను తిరిగి వారి సొంత జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలని కోరారు.