Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డుపై కుంకుడు చెట్టు తండా సర్పంచ్ కుటుంబసభ్యుల ఆందోళన
నవతెలంగాణ - పెద్దవూర
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అనుచరులు బిల్లులు రాకుండా కమీషన్ల కోసం తమను వేధిస్తున్నారంటూ సర్పంచ్ కుటుంబ సభ్యులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. ఆదివారం నల్గొండ జిల్లా పెద్దవూర మండలం కుంకుడు చెట్టు తండా అధికార పార్టీ సర్పంచ్ రమావత్ ప్రియాంక సలహాదారుడు రమావత్ చందునాయక్, ఆయన కుమారుడు ప్రేమ్ చంద్ పురుగుల మందు డబ్బా పట్టుకోని గ్రామంలోని నాగార్జున సాగర్ - నల్లగొండ రహదారిపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. బాధితుల వివరాల ప్రకారం.. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులు, ఎంబీలు, పనులు పూర్తయి దాదాపు 8 నెలలు అవుతున్నా బిల్లులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు, ఉపసర్పంచ్ కలిసి బిల్లులు రాకుండా అడ్డుకుంటు న్నారని తెలిపారు. కమిషన్ ఇవ్వనందుకే వారు సంతకం చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. దాదాపు రూ.10 లక్షలు అప్పు తెచ్చినట్టు చెప్పారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.