Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సేవా పతకాలు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గాలంట్రీ అవార్డుల మాదిరిగానే, తెలంగాణ ప్రభుత్వం కూడా పోలీసు అధికారులకు గత కొన్నేండ్లుగా ఈ అవార్డులను అందచేస్తున్నది. ఈమేరకు ఆదివారం డీజీపీ కార్యాలయం ఒకప్రకటన విడుదల చేసింది. ఏడుగురికి మహోన్నత సేవా పతకాలు, 50 మందికి కఠిన సేవా పతకాలు, 90 మందికి ఉత్తమ సేవా పతకాలు, 471 మందికి సేవా పతకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.