Authorization
Sun April 13, 2025 04:46:05 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 274 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 21,679 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. మరో 3,661 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,779 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 212 మందికి కరోనా సోకింది.
ఐదు జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో శనివారంతో పోలిస్తే ఆదివారం ఐదు జిల్లాల్లో కేసులు పెరిగాయి. ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్ రూరల్ జిల్లాల్లో పెరిగాయి.
16 జిల్లాల్లో తగ్గిన కరోనా
ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ - మల్కాజిగిరి, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, హన్మకొండ,యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తగ్గాయి. మిగితా జిల్లాల్లో ఎలాంటి మార్పు లేదు.
ఐదుగురికి ఒమిక్రాన్
విదేశాల నుంచి వచ్చిన ఐదుగురు కరోనా రోగుల్లో ఒమిక్రాన్ ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు కేసుల సంఖ్య 84కు చేరింది. మరో 30 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నవి. ఇప్పటి వరకు ఒమిక్రాన్ నుంచి 32 మంది కోలుకున్నారు.