Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాపై చిల్లర బ్యాచ్ దుష్ప్రచారం : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తాను టీఆర్ఎస్లోకి పోవాలంటే నాకెవరడ్డు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఓ చిల్లర బ్యాచ్ తయారయ్యిందనీ, అదే తనపై దుష్ప్రచారం చేస్తున్నదని ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి విమర్శించారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నది ఆ పిచ్చి అభిమాన సంఘాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్లోకి వెళ్లాలనుకుంటే తననెవరూ ఆపరేరని స్పష్టం చేశారు. పీసీసీ అనే వాడు కాంగ్రెస్‌కు డ్రైవర్ లాంటివాడనీ, తప్పులు సరిదిద్దుకోమని చెప్పడం కూడా తప్పా? ప్రశ్నించారు. తనను టీఆర్ఎస్ ఎజెంట్ అనడానికి తీన్మార్ మల్లన్న ఎవరు? అని నిలదీశారు. అధికారిక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ను కలిసిన తాను కోవర్ట్ను అయితే.. ఆయన్ను కలిసిన రేవంత్‌రెడ్డి కూడా కోవర్టేనా? అని ప్రశ్నించారు. తనపై దుష్ప్రచారాన్ని టీపీసీసీ చీఫ్ ఎందుకు ఖండించలేదని నిలదీశారు. కాంగ్రెస్‌లోనే ఉన్నా...ఇంక ముందు కూడా ఉంటా...పార్టీలోనే జీవిస్తానని స్పష్టం చేశారు. 'తాను గులాబీ కండువా కప్పుకోనున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. నా నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమానికి కేటీఆర్ వచ్చారు. నియోజకవర్గ సమస్యలపై కేటీఆర్‌కు వినతిపత్రం ఇచ్చాను. మా పార్టీలు వేరైనా ఎదురుపడ్డప్పుడు పలకరించుకోవడం సంస్కారం. దీనిపై కూడా కొన్ని అభిమాన సంఘాలు రాద్ధాంతం చేస్తున్నాయి. గతంలో ఎవరూ కేటీఆర్‌ను కలవలేదా? నేను కేసీఆర్ ఎజెంట్ అంటూ రెండు యూట్యూబ్ చానల్స్ రాశాయి. ఆ రెండు చానల్స్ రేవంత్‌ను ఏమైనా అంటే ఊరుకోవని నాకు తెలుసు' అని ఆరోపించారు.