Authorization
Sat April 12, 2025 09:49:46 pm
- కేంద్రంపై కార్మిక సంఘాల సమర శంఖారావం
- ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం జేఏసీ
- త్వరలో భవిష్యత్ కార్యాచరణ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వంపై అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలోని క్లబ్ హౌస్‌లో ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. బీఎస్ఎన్ఎల్,ఎల్ఐసీ,బీడీఎల్, హెచ్ఎఎల్, బీహెచ్ఇఎల్, రైల్వే, హెచ్ఎంటీ- ప్రాగా టూల్స్, మిధాని, డీఆర్డీిఎల్,ఇసీఐఎల్, మింట్, పోస్టల్, డీిఎల్ఆర్ఎల్,బ్యాంకులు,ఇన్సూరెన్స్ సంస్థల అధికారులు,ఉద్యోగులు,కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వానిది మేకిన్ ఇండియా కాదనీ, సేల్ ఇన్ ఇండియా పాలసీ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై సమర శంఖారావాన్ని పూరిస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, వాటిని ప్రయివేటుపరం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుకు అప్పగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఉద్యోగాలు దక్కకుండా మోడీ ప్రభుత్వం మోసపూరి తంగా పావులు కదుపుతున్నదని ఆరోపించారు. ఏడేండ్ల కాలంలో 37ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మిందని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ విమర్శిం చారు. డిజిటల్ ఇండియాతో ఆర్ధిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు లేవన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలను తిప్పి కొట్టాలని కార్మిక సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.