Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రులకు మంత్రి కేటీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేష్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ని వెంటనే పున:ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. అందుకు సంబం ధించి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని హామీనిచ్చారు. ఈ మేరకు కేంద్రమంత్రులు నిర్మలా సీతారా మన్, మహేంద్రనాథ్ పాండేలకు ఆయన ఆదివారం లేఖ రాశారు. టీఎస్ఐపాస్ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టు బడులు తీసుకొస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నదని తెలిపారు.