Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ కు జగ్గారెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మున్సిపాల్టీల పరిధిలో చట్టవిరుద్ధంగా లే అవుట్ చేసిన ప్లాట్లను క్రమబద్దీకరించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. పేద, మధ్యతరగతి వారు ప్లాట్లను కొన్నారనీ, వారు నష్టపోకుండా క్రమబద్ధీకరించాలని కోరారు. సీఎం కేసీఆర్కు లేఖ రాసినట్టు తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలోనూ ఇలాంటి ప్లాట్లు ఉన్నాయనీ, అవగాహన లేకుండా కొందరు ఇండ్లు కట్టుకున్నారనీ, వారికి బీఆర్ఎస్తో క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మాణాలు, ప్లాట్లను కూడా క్రమబద్దీకరించాల్సిందేనంటూ ఇండ్ల నిర్మాణం అనేది అక్రమం కాదని అభిప్రాయపడ్డ్నా. క్రమబద్దీకరణ చేస్తే ప్రభుత్వానికి నష్టం ఉండదనీ, ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.